అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె!

ఓవైపు అమరావతి ఉద్యమం మహోగ్రంగా సాగుతుండగా ఇటు రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో రైతుల గుండెలు తల్లడిల్లుతున్నాయి.

Update: 2021-01-01 14:15 GMT

ఓవైపు అమరావతి ఉద్యమం మహోగ్రంగా సాగుతుండగా ఇటు రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో రైతుల గుండెలు తల్లడిల్లుతున్నాయి. అమరావతి పోరాటంలో అలసిపోతున్నాయి. అమరావతిలో మరో రైతు గుండె ఆగిపోయింది. మందడం గ్రామానికి చెందిన ముప్పాళ్ల సాంబశివరావు అనే రైతు గుండెపోటుతో కన్నుమూశారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి రెండు ఎకరాల పొలం ఇచ్చాడు సాంబశివరావు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా తలకిందులవడం, రాజధానిని విశాఖ తరలించేందుకు ప్రభుత్వం ప్రకటించడంతో అప్పట్నుంచి రైతులంతా పోరాటం సాగిస్తున్నారు. సాంబశివరావు కూడా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 380 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో సాంబశివరావు మనస్తాపానికి గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

అయితే, అప్పటికే ఆయన చనిపోయాడు. సాంబశివరావు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.. ఈప్రభుత్వం ఇంకా ఎంత మంది రైతుల ప్రాణాలు తీస్తుందంటూ ఫైరవుతున్నారు.

Tags:    

Similar News