ముగిసిన రాష్ట్రస్థాయి 33వ ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలు

Update: 2021-01-20 05:54 GMT

సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబోట్లవారి పాలెంలో రాష్ట్రస్థాయి 33వ ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు, బలప్రదర్శన పోటీలు అట్టహాసంగా ముగిశాయి. గొట్టిపాటి హనుమంతరావు మోమోరియల్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఏడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి రైతులు, పశుపోషకులు భారీగా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కేశనపల్లికి చెందిన రామకోటయ్య ఎడ్ల జతలు 25 నిమిషాల్లో 3,472 అడుగులు బండరాయిని లాగి ప్రథమ బహుమతి గెలుచుకోగా.. ప్రకాశం జిల్లా యద్దనపూడికి చెందిన గొట్టిపాటి భరత్ ఎడ్ల జతలు 25 నిమిషాల్లో 3,388 అడుగులు లాగి ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నాయి.


Tags:    

Similar News