ఏపీలో జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి అనే మాటనే వినిపించలేదు. కేవలం వైసీపీ నేతల అరాచకాలు, కల్తీ మద్యం, జగన్ ప్యాలెస్ లు మాత్రమే కనిపించాయి. అంతకు మించి ఏ ఒక్క కంపెనీ కూడా ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టిన దాఖలాలు కనిపించలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పరిస్థితులను మొత్తం మార్చేసింది. ఏపీకి వరుసగా ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తున్నాయి. విశాఖ టెక్ హబ్ గా మారిపోతోంది. లోకేష్ వరుసగా కంపెనీల ప్రతినిధులను కలుస్తూ ఏపీకి పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు. జగన్ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదే మరి. జగన్ కు అసలు అభివృద్ధి, పెట్టుబడులు అనే మాటే తెలియదు.
కానీ ఇప్పుడు లోకేష్ మాత్రం వరుసగా పరిశ్రమలను తీసుకువస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్యాలెస్ లు కడితే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మాత్రం పరిశ్రమలు తీసుకొస్తున్నామని లోకేష్ చెబుతున్నారు. సెఫీ ఆధ్వర్యంలో కడుతున్న 500 మెగా వాట్ల డేటా సెంటర్ కు నేడు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాము విశాఖకు ప్యాలెస్ లు కట్టుకోవడానికి రాలేదని.. పరిశ్రమలను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వచ్చాయన్నారు. ఇక్కడే ఏర్పాటు చేస్తున్నామని.. సి కేటుల్ సెంటర్లు కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలో కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నట్టు వివరించారు.
పరిశ్రమలు ఏపీకి రావాలంటే భూములు కేటాయించాల్సిందే. అంతే గానీ ప్యాలెస్ కు కేటాయించుకుంటే వచ్చేది ఏమీ ఉండదు అనే విషయాన్ని ఏపీ ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. ఏపీ అభివృద్ధి కోసమే తాము భూములు ఇస్తున్నామని.. జగన్ లాగా ప్యాలెస్ లు కట్టుకోవడానికి భూములు వాడుకోవట్లేదని విమర్శించారు. నిజంగా లోకేష్ చెప్పింది కూడా నిజమే కదా.. ఎందుకంటే ఏపీకి కావాల్సిన అభివృద్ధి కోసం భూములు ఇవ్వడంలో తప్పేముంది. ఇదే పని వైసీపీ చేసి కంపెనీలను తెచ్చి ఉంటే ఈ పాటికి ఏపీ ఎక్కడో ఉండేది. కానీ ఆ విషయంలో వైసీపీ చేయకుండా.. ఇప్పుడు చేస్తున్న కూటమిని అడ్డుకోవడం ఏంటో వారికే తెలియాలి.