పరకామణి కేసులో వైసీపీ నేతలకు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఈ కేసు నుంచి తెరవెనక ఉన్న పెద్దలను తప్పించాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఎంతటి అక్రమాలకు అయినా వెనకాడట్లేదు. అందులో భాగంగానే మాజీ ఏవిఎస్వో సతీష్ హత్య జరిగినట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇదే కేసులో కోర్టు నిన్న కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ ఆస్తులపై విచారణ కొనసాగించాలని ఆదేశించింది. సతీష్ కుమార్ పోస్టుమార్టం రిపోర్టును సిల్డ్ కవర్ లో అందజేయాలని ఆదేశించింది. ఇది ఒక రకంగా వైసీపీకి అతిపెద్ద షాక్ అని చెప్పుకోవాలి.
దీంతో ఈ కేసు వెనకాల ఉన్న పెద్దమనుషులకు భయం పట్టుకుంది. ఎందుకంటే ఈ కేసు నుంచి తన పార్టీ నేతలను తప్పించాలని మొదటి నుంచి జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న మీడియాతో మాట్లాడుతూ పరకామణి చోరీ చాలా చిన్న కేసు అని.. అందులో కేవలం 70000 వరకు మాత్రమే చోరీ జరిగితే తాము కోట్లాది రూపాయల ఆస్తులను టీటీడీకి రాయించాం అని చెప్పడం వెనక.. తన పార్టీ నేతలను కాపాడుకోవాలనే ఉద్దేశం క్లియర్ గా కనిపిస్తూనే ఉంది.
అయితే ఇప్పుడు కోర్టు కీలక ఆదేశాలతో ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. రవికుమార్ ఆస్తులు గతంలో ఎవరి పేరు మీదకు ట్రాన్స్ ఫర్ అయ్యాయి, సతీష్ కుమార్ హత్య వెనక ఎవరున్నారు అనే విషయాలు బయటపడే ఛాన్స్ ఉంది. అలా జరుగుతుందని భయం ఇప్పుడు ఈ కేసులో ఉన్న అంతిమ లబ్ధిదారుల్లో మొదలైంది. అందుకే ఇప్పుడు వాళ్లంతా ఏం చేయాలా అని తలలు పట్టుకుంటున్నారంట. ఈ కేసులో ఉన్న కీలక నిందితులు బయటకు వస్తే దీని వెనుక ఉన్న సూత్రధారులు కూడా బయటపడే ఛాన్స్ లేకపోలేదు. అందుకే కొందరు వైసీపీ నేతలు గుబులు మొదలై.. వారంతా జగన్ వద్దకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా ఈ కేసులో నుంచి తమను బయటపడే చేయాలని వేడుకుంటున్నారంట.