PAWAN: దెబ్బతిన్న పంటలను పరిశీలించిన డిప్యూటీ సీఎం

అండగా ఉంటామని రైతులకు హామీ

Update: 2025-10-30 09:12 GMT

ఏపీ డి­ప్యూ­టీ సీఎం పవ­న్‌ కల్యా­ణ్‌ కృ­ష్ణా జి­ల్లా అవ­ని­గ­డ్డ ని­యో­జ­క­వ­ర్గం­లో­ని కో­డూ­రు మం­డ­లం కృ­ష్ణా­పు­రం గ్రా­మం­లో పర్య­టిం­చా­రు. ‘మొం­థా’ తు­పా­ను ప్ర­భా­వం­తో దె­బ్బ­తి­న్న పంట పొ­లా­ల­ను పరి­శీ­లిం­చా­రు. రై­తు­ల­తో మా­ట్లా­డి వి­వ­రా­లు తె­లు­సు­కు­న్నా­రు. ప్ర­భు­త్వం అం­డ­గా ఉం­టుం­ద­ని వా­రి­కి హామీ ఇచ్చా­రు. తు­పా­ను ప్ర­భా­వం తీ­వ్రం­గా ఉన్న గ్రా­మా­ల్లో సూ­ప­ర్ క్లో­రి­నే­ష­న్, సూ­ప­ర్ శా­ని­టే­ష­న్ కా­ర్య­క్ర­మా­ల­ను మొ­ద­లు­పె­ట్టా­ల­ని ఆదే­శిం­చా­రు. తు­పా­ను ప్ర­భా­వం వల్ల పా­డైన రో­డ్ల­ను ప్రా­ధా­న్య ప్ర­కా­రం బాగు చే­యా­ల­న్నా­రు. క్షే­త్ర­స్థా­యి­లో ప్ర­స్తుత పరి­స్థి­తి­ని అడి­గి తె­లు­సు­కు­న్నా­రు. తీ­సు­కో­వా­ల్సిన చర్య­ల­ను తక్ష­ణ­మే మొ­ద­లు­పె­ట్టా­ల­ని డి­ప్యూ­టీ సీఎం పవన్ ఆదే­శిం­చా­రు.

బాధితులకు అండగా ఉంటాం

ప్ర­భు­త్వం రై­తుల పక్షాన ని­ల­బ­డి, అన్ని వి­ధాల సహా­యం అం­ది­స్తుం­ద­ని పవన్ హామీ ఇచ్చా­రు. రై­తుల పంట నష్టా­ల­పై అధి­కా­రు­ల­ను సమ­గ్ర ని­వే­దిక ఇవ్వా­ల­ని ఆదే­శిం­చా­రు. ఇది­లా ఉంటే మొం­థా తు­ఫా­న్ ప్ర­భా­వం­తో కృ­ష్ణా, గుం­టూ­రు జి­ల్లా­ల్లో వేల ఎక­రాల వ్య­వ­సాయ భూమి దె­బ్బ­తి­న్న­ట్లు అం­చ­నా. కే­వ­లం కృ­ష్ణా జి­ల్లా­లో­నే 2.5 లక్షల ఎక­రా­ల్లో వరి పంట తీ­వ్రం­గా నష్ట­పో­యిం­ది. అరటి, బొ­ప్పా­యి గా­లి­వా­న­తో నే­ల­మ­ట్ట­మ­య్యా­యి. తు­ఫా­న్ తా­కి­డి­తో చె­రు­వు­ల్లా మా­రిన పొ­లాల దృ­శ్యా­లు హృ­ద­య­వి­దా­ర­కం­గా మా­రా­యి. ఈ నే­ప­థ్యం­లో రా­ష్ట్ర ప్ర­భు­త్వం రై­తు­ల­కు తగిన పరి­హా­రం అం­దిం­చేం­దు­కు ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­ది­స్తు­న్న­ట్లు సమా­చా­రం అం­దు­తుం­ది. ఈ క్ర­మం­లో డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ సహా.. ఇతర మం­త్రు­లు ఈ రోజు వరద ప్ర­భా­విత ప్రాం­తా­ల్లో పర్య­టిం­చా­రు. సీఎం చం­ద్ర­బా­బు ముం­దు జా­గ్ర­త్త­తో తు­పా­ను వల్ల జరి­గే నష్టం అధి­కం­గా జర­గ­కుం­డా చూ­శా­మ­ని అన్నా­రు. భారీ వర్షాల కా­ర­ణం­గా 46 వేల హె­క్టా­ర్ల­లో పంట నష్టం వచ్చిం­ద­ని, దీం­తో 56 వేల మంది రై­తు­లు తీ­వ్రం­గా నష్ట­పో­యా­ర­ని, వీ­రి­లో అత్య­ధి­కం­గా కౌ­లు­రై­తు­లే ఉన్నా­ర­ని, వా­రం­ద­రి­ని ఆదు­కు­నేం­దు­కు సీఎం చం­ద్ర­బా­బు­తో రి­వ్యూ మీ­టిం­గ్ లో చర్చిం­చి ని­ర్ణ­యం తీ­సు­కుం­టా­మ­ని అన్నా­రు.

Tags:    

Similar News