JANASENA: నేటి నుంచే పవన్‌ ప్రచారం

పిఠాపురం నుంచి ప్రారంభం.. తొలి విడత పది నియోజకవర్గాల్లో జనసేనాని ప్రచారం;

Update: 2024-03-30 02:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం నేటి నుంచే ప్రారంభం కానుంది. పవన్ పోటీ చేసే పిఠాపురంలో రెండు విడతలుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. తొలి విడతలో దాదాపు 10 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు.

ఇదే షెడ్యూల్‌

మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2 వరకు-పిఠాపురం

ఏప్రిల్‌ 3న తెనాలి

ఏప్రిల్‌ 4న నెల్లిమర్ల

ఏప్రిల్‌ 5న అనకాపల్లి

ఏప్రిల్‌6న యలమంచిలి

ఏప్రిల్‌7న పెందుర్తి

ఏప్రిల్‌ 8న కాకినాడ రూరల్‌ నియోజకవర్గం

ఏప్రిల్‌ 9న పిఠాపురంలో ఉగాది వేడుకలు

ఏప్రిల్‌ 10న రాజోలు

ఏప్రిల్‌ 11న పి.గన్నవరం

ఏప్రిల్‌ 12న రాజానగరం

ఈ నియాజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమాలను జనసైనికులు, వీరమహిళలు విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్‌ కోరారు. ఈ సమావేశ్లలో పవన్‌ బహిరంగ సభతో పాటు పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తారు.


మరోవైపు వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన అన్ని పథకాల్లో భారీ అవినీతి జరిగిందని జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదన్న సీఎం జగన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 2వేల కోట్లతో కొనుగోలు చేసిన 4లక్షలకుపైగా గేదెలు ఏమయ్యాయని నాదెండ్ల ప్రశ్నించారు. అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ కే 8లక్షల 3వేల 612 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. 

Tags:    

Similar News