AP : ఇతర మతాలు ధర్మానికి మర్యాద ఇవ్వాలి..మర్యాద పుచ్చుకోవాలి.. పవన్ కామెంట్స్ వైరల్
ఇస్లాంను గౌరవిస్తా, క్రిస్టియానిటినీ గౌరవిస్తా.. హిందుత్వాన్ని పాటిస్తాను అని పవన్ కల్యాణ్ ఆవేశపూరితంగా తిరుమలలో చెప్పారు. తాను ఎన్నడూ ధర్మం తప్పనని, అది జరిగితే తనకు డిప్యూటీ సీఎం పదవికి కూడా అక్కరలేదని పవన్ కల్యాణ్ అన్నారు. పరాభవం పొందినా, పరాజయం చెందినా తాను మౌనంగానే ఉంటానని అన్నారు. గత కొంత కాలంగా కల్తీ నెయ్యితో, జంతువుల కొవ్వుతో ఏడుకొండల వాడికి ప్రసాదం పెడతారా అన్నారు. అవే లడ్డూలు అయోధ్యకు పంపించారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాముడ్ని అంటే హిందువులు బాధపడకూడదా అంటూ ప్రశ్నించారు.
ఇతర మతాలు ధర్మాన్ని గౌరవించాలని.. అన్ని మతాలు మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని.. అదే భారత దేశంలోని భిన్నత్వంలో ఏకత్వమని మరోసారి చెప్పారు పవన్ కళ్యాణ్.