ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు అధికారులను మాజీ ముఖ్యమంత్రి జగన్ బెదిరించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటు చేశారు. ఐఏఎస్ లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని స్పష్టం చేశారు. ఇలాంటివి మానుకోవాలని హెచ్చరించారు. మీరు బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరన్నారు. డీజీపీని, ఐపీస్ సుబ్బారాయుడిని సప్త సముద్రాల అవతల ఉన్నా రిటైర్ అయినా పిలిపిస్తాం అని జగన్ అనడాన్ని తప్పుపట్టారు. మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని హెచ్చరించారు. అధికారుల మీద చిన్న గాటు పడిన చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.