Pawan Kalyan: పొత్తులపై పవన్ కళ్యాణ్‌ కీలక వ్యాఖ్యలు.. అన్నిసార్లు తగ్గానంటూ..

Pawan Kalyan:పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసం తాను తగ్గడానికి సిద్ధంమని ప్రకటించారు

Update: 2022-06-04 15:45 GMT

Pawan Kalyan: పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసం తాను తగ్గడానికి సిద్ధంమని ప్రకటించారు. అన్నిసార్లు తగ్గాను.. ఈసారి మిగతావారు తగ్గితే బాగుంటుందన్నారు. గతంలో వన్‌సైడ్‌ లవ్ కామెంట్లు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు వార్ వన్‌సైడ్‌ అంటున్నారని, చంద్రబాబు నుంచి క్లారిటీ వచ్చాక మిగతా విషయాలు మాట్లాడతానని చెప్పారు.

ప్రస్తుతం జనసేన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని.. జనసేన- బీజేపీ ప్రభుత్వం స్థాపించడం, జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని స్థాపించడం.. ఈ మూడు ప్రత్యామ్నాయాలపై చర్చిస్తామని స్పష్టంచేశారు. జనసేన- బీజేపీకి మంచి సంబంధాలే ఉన్నాయని, కరోనా కారణంగా ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టలేకపోయాయని, త్వరలో రెండు పార్టీల మధ్య సోషల్‌ డిస్టేన్స్‌ తగ్గుతుందన్నారు పవన్ కళ్యాణ్.

Tags:    

Similar News