AP : యువకులు కూడా చంద్రబాబులా పనిచేయలేరు.. పవన్ ప్రశంస

Update: 2024-09-19 12:30 GMT

"100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చాం. పింఛన్ పెంచేందుకు ఖజానాలో డబ్బులు లేవు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్లు పెంచాం. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించాం..." అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని సీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పవన్ మాట్లాడారు.

చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు పవన్. ఇంకుడు గుంతలంటే ఏదో చిన్న అంశంగా కన్పిస్తుందని.. దాని వల్ల వచ్చే లాభాలు అపారం అన్నారు. ఇప్పుడు ఇంకుడు గుంతలు జీవన విధానంలో భాగమైందన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా వచ్చేవి కావనీ.. ఇప్పుడు ఒకటో తేదీన జీతాలు వస్తున్నాయన్నారు. స్థానిక సంస్థలకు గత ప్రభుత్వం నిధులను పక్క దారి పట్టిస్తే.. చంద్రబాబు రూ. 1450 కోట్లు ఇచ్చారన్నారు.

యువత కూడా చంద్రబాబులా పోటీపడలేరని అన్నారు పవన్ కళ్యాణ్. కష్టసమయంలో ఓ సీఎం ఎలా స్పందించాలో దేశానికి చూపించారని పవన్ మెచ్చుకున్నారు.

Tags:    

Similar News