ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్‌ను చంపేస్తామంటూ అగంతకుడు ఫోన్ చేశాడు. ఏకంగా డిప్యూటీ సీఎం పేషీకే ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అభ్యంతరకర భాషలతో బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. విషయాన్ని పవన్ కల్యాణ్ తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. ఉన్నతాధికారులతో ఈ వ్యవహారంపై మాట్లాడారు. అధికారులు ఆదేశంలో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై దృష్టి సారించారు. నిజంగా పవన్ కల్యాణ్ కు ముప్పు పొంచి ఉందా .. ఇది ఆకతాయిల పనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.