Pawan Kalyan: స్టీల్‌ప్లాంట్ కార్మికులకు సంఘీభావంగా పవన్ కల్యాణ్ ఉక్కు దీక్ష..
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగనున్నారు.;
Pawan Kalyan (tv5news.in)
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగనున్నారు. స్టీల్‌ప్లాంట్ కార్మికులకు సంఘీభావంగా ఆయన నిరసన దీక్ష చేయనున్నారు. ఇప్పటికే జనసేన ప్రధాన కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు పవన్ దీక్ష కొనసాగనుంది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు.. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని విశాఖ సభలో పవన్ డిమాండ్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో.. పవన్ కల్యాణ్ దీక్షకు సిద్ధమైనట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అలుపెరగకుండా పోరాటం చేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.