ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. అనంతగిరి మండలం బల్లగరువు(పినకోట పంచాయతీ)లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10:30 గంటలకు ఆయన బల్లగరువు ప్రాంతానికి చేరుకుంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన పార్వతపురం మన్యం జిల్లాలో విజయవంతంగా ముగిసింది. ఒక వైపు జోరు వాన.. మరోవైపు గిరిజన పుత్రులు కేరింతలతో హడావుడి గా సాగింది. రోడ్డు నిర్మాణ పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లనాటి సమస్యకు పరిష్కర లభించిందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాగుజోల నుంచి సురవర వరకు తొమ్మిది కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు పవన్.