PAWAN: ప్రభుత్వానికి భారమైనా ఆనందంగా భరిస్తాం: పవన్
ఆటో వెనుక కొటేషన్లు చదువుతా: లోకేశ్
ఏపీలో ఆటో డ్రైవర్లకుసేవలో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "స్త్రీ శక్తి పథకం అమలు సమయంలో ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేశాం.. ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే ఆటో డ్రైవర్ల ఉపాధికి ఇబ్బంది అవుతుందని చర్చించాం.. కేబినెట్ మీటింగ్ లో సీఎం ఆటో డ్రైవర్స్ గురించి హామీ ఇచ్చారు.. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అర్హులైన ప్రతి ఒక్కరికీ 15 వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు.. ఇక, ఎన్నికల సమయంలోనే ఆటో డ్రైవర్ల ఇబ్బందులు తెలుసుకున్నాను.. ప్రభుత్వానికి భారమైన మీ కోసం ఆనందంగా దాన్ని మోస్తాం" అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
కొటేషన్లు చదువుతా: లోకేశ్
ఆటో డ్రైవర్ల సేవలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల మౌత్ పబ్లిసిటీకి వైనాట్ 175 అని అన్న వారిని 11కి దించారని సెటైర్లు వేశారు. ఆటోల వెనక ఉండే కొటేషన్లపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. " ఆటోల వెనుక ఉన్న కొటేషన్లు నేను చదువుతాను.. ఒక ఆటో డ్రైవర్ వర్షం ఎలా వస్తుందని పిల్లలు అడిగితే దేవుడు కురిపిస్తాడు అని చెప్పోద్దు.. మొక్క నాటితే వర్షం దాని వల్ల కురుస్తుందని చెప్పారు.. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని ఆటో డ్రైవర్ అనుకుంటారు.. ఇక, ఆటోలో బ్యాగ్ మర్చిపోతే జాగ్రత్తగా పోలీసుకలు అప్పగిస్తారు ఆటో డ్రైవర్లు. యువగళం అప్పడు ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా మాట్లాడాను.. కుడి చేత్తో రూ. 10 వేలు ఇచ్చి ఎడమ చేత్తో రూ. 20వేలు గ్రీన్ టాక్స్ రూపంలో గత ప్రభుత్వం లాగేసిందన్నారు. గుంతలు లేకుండా చూడడం ద్వారా ఆటో ప్రమాదాలు నివారించాం.. ఆటో చార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసి వారికి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుంది" అని నారా లోకేష్ వెల్లడించారు.