సుబ్బయ్య మృతదేహానికి నివాళులర్పించిన పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి

ష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటం చేతకాకపొతే సీఎం జగన్‌ వెంటనే పదవి నుంచి తప్పుకొవాలని తులసిరెడ్డి అన్నారు.

Update: 2020-12-30 07:35 GMT

కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన టిడిపి నాయకుడు నందం సుబ్బయ్య మృతదేహానికి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, టీడీపీ నేతలు పుట్టా సుధాకర్ యాదవ్, రాజంపేట టీడీపీ పార్లమెంటరీ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు నివాళులర్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తులసిరెడ్డి మండిపడ్డారు. జగన్ పాలనలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కరువయ్యిందని అన్నారు. ఎప్పుడు ఎవరి ప్రాణాలకు నూకలు చెల్లుతాయో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని అన్నారు. గత నాలుగైదు మాసాల్లో జిల్లాలో అనేక మంది హత్యకు గురయ్యారని.. అవినీతిని ప్రశ్నించినందుకు నందం సుబ్బయ్యను హత్య చెయ్యడం దారుణమని అన్నారు. సుబ్బయ్య హత్యకు కారకులైనవారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటం చేతకాకపొతే సీఎం జగన్‌ వెంటనే పదవి నుంచి తప్పుకొవాలని అన్నారు.

Full View

Similar News