Nellore Floods: 4 రోజులుగా వరద నీటిలోనే ఇళ్లు.. మిద్దెల పైనే బిక్కుబిక్కుమంటూ ఉన్న ప్రజలు..
Nellore Floods: నెల్లూరు జిల్లాలోని పెన్నా పరీవాహక ప్రాంతాలు 4 రోజులుగా వరద నీటిలోనే నానుతున్నాయి.;
Nellore Floods (tv5news.in)
Nellore Floods: నెల్లూరు జిల్లాలోని పెన్నా పరీవాహక ప్రాంతాలు 4 రోజులుగా వరద నీటిలోనే నానుతున్నాయి. సోమశిల నుంచి వరద తగ్గినా ముంపు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. కోవూరు పట్టణంలోని కొన్ని కాలనీల్లో జనం ఇంకా జనం మిద్దెలపైనా ఉంటున్నారు. అటు, పడుగుపాడు వద్ద దెబ్బతిన్న రైల్వేట్రాక్ పునరుద్ధరణకు ప్రయత్నాలు కూడా వేగవందం చేశారు.
నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, ఇందుకూరుపేట మండల్లాల్లో అనేక గ్రామాలు ముంపు ముప్పు నుంచి ఇంకా బయటపడలేదు. సోమశిల నుంచి 1 లక్ష 70 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లోతో ఉంది. అటు, కోవూరు నుంచి నీటని బయటకు పోయేలా చేసేందుకు బ్యారేజీ దిగువన పొర్లుకట్టకు గండికొట్టారు. విద్యుత్ పునరుద్ధరణకు ఇంకో 24 గంటలు పట్టేలా ఉంది.