Krishna District: కృష్ణా జిల్లాలో అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో పిల్‌..

Krishna District: కృష్ణా జిల్లాలో అక్రమ మైనింగ్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది..

Update: 2022-06-13 11:00 GMT

Krishna District: కృష్ణా జిల్లాలో అక్రమ మైనింగ్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.. ఎడ్లంక, అవనిగడ్డ మండలాల్లో ప్రభుత్వ, రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ మైనింగ్‌ జరుగుతోందంటూ అవనిగడ్డకు చెందిన మాజీ జెడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు.. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది..

కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ పెద్దల అండదండలతో కోట్లాది రూపాయల అక్రమ మైనింగ్‌ జరుగుతోందని న్యాయవాది శ్రావణ్‌ కుమార్‌ వాదించారు.. తక్షణమే మైనింగ్‌ నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.. దీనిపై అధికారులు వివరణ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.. కేసును మూడు వారాలు వాయిదా వేసింది.

Tags:    

Similar News