PINNELLI: పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ముందస్తు బెయిల్‌ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

Update: 2025-08-30 06:00 GMT

వై­సీ­పీ మాజీ ఎమ్మె­ల్యే పి­న్నె­ల్లి రా­మ­కృ­ష్ణా­రె­డ్డి సో­ద­రు­ల­కు ఏపీ హై­కో­ర్టు­లో భారీ ఎదు­రు­దె­బ్బ తగి­లిం­ది. టీ­డీ­పీ నేతల జంట హత్యల కే­సు­లో పి­న్నె­ల్లి రా­మ­కృ­ష్ణా­రె­డ్డి, ఆయన సో­ద­రు­డు వెం­క­ట్రా­మి­రె­డ్డి నిం­ది­తు­లు­గా ఉన్నా­రు. ఈ కే­సు­లో వా­రి­ద్ద­రూ హై­కో­ర్టు­లో ముం­ద­స్తు బె­యి­ల్‌ పి­టి­ష­న్‌ దా­ఖ­లు చే­శా­రు. ఈ పి­టి­ష­న్ ను వి­చా­రిం­చిన హై­కో­ర్టు ధర్మా­స­నం పి­టి­ష­న్‌­ను కొ­ట్టి­వే­సిం­ది. పల్నా­డు జి­ల్లా మా­చ­ర్ల ని­యో­జ­క­వ­ర్గం వె­ల్దు­ర్తి మం­డ­లం గుం­డ్ల­పా­డు­కు చెం­దిన టీ­డీ­పీ నా­య­కు­లు జవి­శె­ట్టి వెం­క­టే­శ్వ­ర్లు, జవి­శె­ట్టి కో­టే­శ్వ­ర­రా­వుల హత్య­లో పి­న్నె­ల్లి సో­ద­రుల ప్ర­మే­యం ఉం­ద­ని పో­లీ­సు­లు కేసు నమో­దు చే­శా­రు. ప్ర­త్య­క్ష సా­క్షి, మృ­తుల బం­ధు­వు తోట ఆం­జ­నే­యు­లు ఫి­ర్యా­దు మే­ర­కు నిం­ది­తు­ల­పై 302 సె­క్ష­న్‌ కింద కేసు నమో­దు చే­శా­రు. ఏ1గా జవి­శె­ట్టి శ్రీ­ను ఎలి­యా­స్‌ బొ­బ్బి­లి, ఏ2గా తోట వెం­క­ట్రా­మ­య్య, ఏ3గా తోట గు­ర­వ­య్య, ఏ4గా దొం­గ­రి నా­గ­రా­జు, ఏ5గా తోట వెం­క­టే­శ్వ­ర్లు, ఏ6గా పి­న్నె­ల్లి రా­మ­కృ­ష్ణా­రె­డ్డి, ఏ7గా పి­న్నె­ల్లి వెం­క­ట్రా­మి­రె­డ్డి­ల­ను పే­ర్కొ­న్నా­రు. జవి­శె­ట్టి వెం­క­టే­శ్వ­ర్లు, జవి­శె­ట్టి కో­టే­శ్వ­ర­రా­వుల హత్య­లో పి­న్నె­ల్లి రా­మ­కృ­ష్ణా­రె­డ్డి సో­ద­రుల పా­త్ర ఉం­ద­ని, అం­దు­కు ఆధా­రా­లు­న్నా­య­ని అడ్వొ­కే­ట్‌ జన­ర­ల్‌ వా­ద­న­లు వి­ని­పిం­చా­రు.

ఈ పిటిష‌న్ విచార‌ణలో ఉంద‌న్న కార‌ణంగా వారిని అరెస్టు చేయ‌లేదు. ఇదిలావుంటే, శుక్ర‌వారం వీరి ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్లు హైకోర్టులో విచార‌ణకు వ‌చ్చాయి. వీటిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు పోలీసుల వైఖ‌రిని త‌ప్పు ప‌డుతూ పిటిష‌న్ల‌ను కొట్టి వేసింది. దీంతో పోలీసులు పిన్నెల్లి సోద‌రుల‌ను అరెస్టు చేసేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. మరోవైపు, ఇద్ద‌రు సోద‌రులు రాష్ట్రం నుంచి ప‌రార‌య్యార‌ని టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News