ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:55 గంటలకు మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూమిటి నేతలు స్వాగతం పలుకనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 3:15 గంటలకు వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న హెలిపాడ్‌కు పీఎం చేరుకుంటారు. హెలిపాడ్ వద్ద ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సభాస్థలికి చేరుకుని అమరావతి పున:ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. గంటా 15 నిమిషాల పాటు మోదీ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:55 గంటలకు తిరిగి హెలికాఫ్టర్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు మోదీ. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.
డ్రోన్లు, బెలూన్లపై నిషేధం
ఆదాన్ న్యూస్: ప్రధాని మోదీ ఏపీకి రానున్న నేపథ్యంలో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదేశాలు ధిక్కరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అమరావతిలో రూ.58 వేల కోట్ల ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి, విశాఖలో రూ.3,680 కోట్ల పనులు ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.