పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. వారికి నచ్చిన కాంట్రాక్టర్లకే పనులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పూర్తి చేయలేరన్నారు. ఏపీ సీఎం అబద్ధాలు చెప్పడంలో ఎక్స్ పర్ట్ అని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం ఆదమరుపుగా ఉన్న గోదావరి జిల్లాలకు పెను ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వరదల కారణంగా మరో 15 రోజులలో ప్రాజెక్టు పనులు నిలిచిపోతాయని అంచనా వేశారు.
బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని హర్ష కుమార్ అన్నారు. ఆ ప్రాజెక్టులో ఏడాదంతా నీరు ఉండదని.. దానికోసం 82 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దండగా అని అన్నారు. అక్కడ మంచి మంచి భూములు తీసుకుని రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రాజెక్టు పేరుతో డబ్బు దోచుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బనకచర్లను కేంద్రం ఆపివేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.