GV Harsha Kumar: మాజీ ఎంపీ తనయుడిపై కేసు..అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ..
GV Harsha Kumar: మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్‌పై కేసు నమోదైంది.;
GV Harsha Kumar: మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్‌పై కేసు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలో ఒక అమ్మాయిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో 354డీ, 504 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరాజ్ తన కారులో స్నేహితులతో కలిసి వెళ్తూ తనపై అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ బాధితురాలు కోరుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.