Avanthi Srinivasa Rao : మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై విశాఖ పోలీసులకు ఫిర్యాదు
Avanthi Srinivasa Rao : మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది బ్రాహ్మణ సంక్షేమ వేదిక;
Avanthi Srinivasa Rao : మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది బ్రాహ్మణ సంక్షేమ వేదిక. రైతు భరోసా కవరేజ్‌కు వెళ్లిన టీవీ5 రిపోర్టర్‌ను.. పంతులు నీ సంగతి చూస్తా అంటూ మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ బెదిరించారు. దీంతో రిపోర్టర్‌ను కులంతో దూషించిన మాజీ మంత్రి అవంతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈనెల 16న విశాఖ జిల్లా పద్మనాభ మండలం, కోరాడ గ్రామంలో రైతు భరోసా సభ జరిగింది. ఈ సభలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ బ్రాహ్మణులను ఉద్దేశిస్తూ.. పంతులూ, నీ అంతు చూస్తా అంటూ కులదూషణ చేశారని బ్రాహ్మణ సంక్షేమ వేదిక పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఐపీసీ 153(C), 509(A) ప్రకారం మాజీ మంత్రి అవంతిపై చర్యలు తీసుకోవాలని కోరారు.