'నేనేమైనా హత్యలు చేయడానికి వెళ్తున్నానా'.. : చంద్రబాబు
విమానాశ్రయం లాంజ్‌లోనే కూర్చుని నిరసన తెలిపారు చంద్రబాబు.;
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో నిర్బంధించారు పోలీసులు. చిత్తూరు, తిరుపతి పర్యటనకు అనుమతి ఇవ్వకుండా తనను నిర్బంధించడంపై మండిపడ్డారు చంద్రబాబు. విమానాశ్రయం లాంజ్‌లోనే కూర్చుని నిరసన తెలిపారు. తనను ఎందుకు నిర్బంధించారో సమాధానం చెప్పాలని నిలదీశారు.
14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఇలా ఎయిర్‌పోర్ట్‌లో ఆపేయడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. నేనేమైనా హత్యలు చేయడానికి వెళ్తున్నానా అంటూ కూడా పోలీసులపై మండిపడ్డారు. ఆ వెంటనే నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నారు చంద్రబాబు.పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. తనకు పర్యటించే హక్కు లేదా..? అని ప్రశ్నించారు.
ప్రతిపక్షనేతనైన తనను ఎయిర్‌పోర్టులో ఎందుకు నిర్బంధించారో చెప్పి..అరెస్టు చేసి తీసుకెళ్లాలంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మిషన్ ఇవ్వకపోతే ఎస్పీతో మాట్లాడతానని అంతవరకూ ఎయిర్‌పోర్టులోనే కూర్చుంటానన్నారు చంద్రబాబు.