శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ఆడపడుచులు వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు చేసుకుంరు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పలు ఆలయాల్లో అమ్మవార్లను కరెన్సీ నోట్లు, పూలతో విశేషంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో సామూహిక వ్రతాలు, కుంకుమార్చనలు నిర్వహించారు.
ఇస్తినమ్మా వాయనం
వరలక్ష్మీ వ్రతంలో పూజ పూర్తైన తర్వాత ముత్తైదువలకు ఇచ్చే వాయనం చాలా ముఖ్యమైనది. ఇంటికి పిలిచిన ముత్తైదువులను కుంకుమ బొట్టు పెట్టి, పాదాలకు పసుపు రాయాలి. వాయనంలో జాకెట్ ముక్క పెట్టి రెండు తమలపాకులో పసుపు, కుంకుమ, 2 వక్కలు, గాజులు, రెండు పండ్లు, పూలు, పసుపు కొమ్ము, రూపాయి నాణెం, నానబెట్టిన శనగలు పెట్టి ఇవ్వాలి. వీటిని ముత్తైదువుకు అందిస్తూ ఇస్తినమ్మా వాయనం అంటే.. వారు పుచ్చికుంటినమ్మా వాయనం అంటారు.