అనుచిత వ్యాఖ్యల కేసులో నటుడు పోసాని కృష్ణ మురళికి.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి సమయంలో పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ముందు పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం... పోసానికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోసానిని కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఈ కేసులో రైల్వే కోడూరు కోర్టులో రాత్రంతా వాదనలు కొనసాగాయి. రాత్రి 9.30కు పోసానిని కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు 10 గంటలకు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5.30 వరకు సుమారు 7 గంటలపాటు వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం... పోసానికి మార్చి 13 వరకు రిమాండ్ విధిస్తూ రైల్వేకోడూరు మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు.