సింహాద్రి అప్పన్న ఆలయంలో జరిగిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'గోడ కూలి మహిళలు సహా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' అని ముర్ము ట్వీట్ చేశారు. ఈరోజు (బుధవారం) సింహాచలం నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలటంతో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
మృతుల వివరాలు..
పత్తి దుర్గాస్వామి నాయుడు (32), మాచవరం, తూర్పుగోదావరి జిల్లా
ఎడ్ల వెంకటరావు (48) అడవివరం, విశాఖపట్నం
కుమ్మపట్ల మణికంఠ (28), మాచవరం, తూర్పుగోదావరి జిల్లా
గుజ్జరి మహాలక్ష్మి (65), హెబీ కాలనీ, వెంకోజీ పాలెం, విశాఖపట్నం
పైలా వెంకటరత్నం (45), ఉమానగర్, వెంకోజీ పాలెం, విశాఖపట్నం
పిళ్లా ఉమామహేశ్ (30), చంద్రపాలెం, మధురవాడ, విశాఖపట్నం
పిళ్లా శైలజ (26) చంద్రంపాలెం, మధురవాడ, విశాఖపట్నం