సీఎం చంద్రబాబు నాయుడు పాలనను ప్రధాని నరేంద్ర మోడీ కూడా మెచ్చుకున్నారు. దేశంలోనే ఏపీ స్పీడ్ గా డెవలప్ మెంట్ అవుతోందని స్వయంగా ప్రశంసించారు. దీంతో వైసీపీ నేతలకు పాపం కునుకు పట్టట్లేదు. తాము కూటమి మీద ఎంత బురద జల్లాలని చూసినా ఎవరూ నమ్మట్లేదు. పైగా నరేంద్ర మోడీ ఏపీకి వచ్చి కూటమి పాలనను మెచ్చుకున్నాక ఇంక తమ ప్లాన్లు అన్నీ వేస్టేనా అన్నట్టు వాళ్లు తెగ బాధపడిపోతున్నారు కాబోలు. కర్నూలులో జరిగిన సూపర్ జీఎస్టీ, సూపర సేవింగ్స్ సభలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను పీఎం మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. రూ.13400 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏపీ ఎలా అభివృద్ధి చెందుతుందో.. సీఎం చంద్రబాబు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో స్వయంగా చెప్పారు నరేంద్ర మోడీ.
వాస్తవానికి నరేంద్ర మోడీ కేవలం బీజేపీ సీఎంలను తప్ప ఎన్డీయే సీఎంలను కూడా పెద్దగా పొగడరు. కానీ సీఎం చంద్రబాబు పాలనను ఆకశానికి ఎత్తేశారంటే ఆయనకు ఏ స్థాయిలో కూటమి పాలన నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 'ఏపీకి సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యణ్ రూపంలో సమర్థవంతమైన నాయకత్వం ఉంది. సైన్స్, టెక్నాలజీలో దేశంలోనే ఏపీ స్పీడ్ గా డెవలప్ అవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏపీకి వచ్చింది. ఏఐ హబ్ వస్తోంది. ఐటీ కంపెనీలు వస్తున్నాయి. గూగుల్ అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ ఏపీలోనే పెడుతోంది. దీని తర్వాత అనేక కంపెనీలు వస్తాయి. విశాఖ రూపు రేఖలే మారిపోతాయి. ఏపీ అభివృద్ధిలో పూర్తి స్థాయిలో కేంద్రం సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ఈ అంశాలన్నీ గుర్తు పెట్టుకుని మరీ చెప్పాల్సిన అవసరం ఏముంది. ఎందుకంటే పనిచేసే వాళ్లను ప్రశంసించాలి అని ఆయన అనుకున్నారు కాబట్టే గూగుల్ డేటా సెంటర్ ఎంత ఇంపార్టెంట్ అనేది స్వయంగా దేశ ప్రధానే చెప్పారు. కానీ వైసీపీ వాళ్లు మాత్రం గూగుల్ డేటా సెంటర్ ఏం లాభం లేదని బురద జల్లుతున్నారు. దేశ ప్రధాని గూగుల్ డేటా సెంటర్ ఇంపార్టెన్స్ చెబుతున్నారు కానీ ఏపీ వైసీపీ నేతలు మాత్రం అబ్బే మేం తీసుకురానిది ఏదైనా సరే అది పనికిరానిదే అన్నట్టు మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి వాళ్ల అజ్ఞానం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ పొగడ్తలతో ఏపీ ప్రజల్లో సీఎం చంద్రబాబు ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దేశంలోనే ఏపీ స్పీడ్ గా డెవలప్ అవుతోందని నరేంద్ర మోడీ చెప్పారు అంటే.. బీజేపీ స్టేట్స్ ను మించి ఏపీ ఎదుగుతోందని ఆయన ఒప్పేసుకున్నట్టే కదా. నిజంగా అలా జరగకపోతే బీజేపీ రాష్ట్రాలను కాదని ఏపీని ఇలా పొగడరు కదా. అంటే సీఎం చంద్రబాబు పనితనం ఎంత గొప్పగా ఉందో ఇక్కడే అర్థమైపోతోంది.