AP Private Schools : ఏపీలో ఇవాళ ప్రైవేట్ స్కూళ్లు బంద్

Update: 2025-07-03 06:15 GMT

ప్రైవేటు స్కూళ్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను మూసివేసినట్లు ఏపీ ప్రైవేటు స్కూల్స్ యాజమాన్య సంఘాలు ప్రకటించాయి. తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ పట్ల అధికారుల తీరు సరిగ్గా లేదని.. కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఆరోపించాయి. స్కూల్స్ ను నిత్యం చెక్ చేయడం.. తమను బెదిరింపులకు గురిచేస్తున్న ఘటనలు బాధ కలిగిస్తున్నాయని తెలిపాయి. ఆర్టీఈ ప్రవేశాల్లో తగిన ధ్రువీకరణ లేకుండా చేర్చుకోవాలని అధికారులు ఒత్తిడి తేవడంతో పాటు షోకాజ్‌ నోటీసులతో వేధించడం వంటి చర్యలను నిరసిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లను మూసివేయాలని నిర్ణయించినట్లు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు స్పష్టం చేశాయి.

Tags:    

Similar News