Pulasa Fish : రూ. 18వేలకు అమ్ముడుపోయిన పులస చేప

Update: 2025-07-12 07:30 GMT

మాంసాహార ప్రియులు అత్యంత ఇష్టంగా తినే పులసల సీజన్ యానాం లో మొదలైంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సుమారు కేజీన్నర మొట్టమొదటి పులస వలకి చిక్కింది. దీనిని వేలం పాటలో మార్కెట్ లో చేపల విక్రయించే పోనమండ భద్రం రత్నం దంపతులు 15,000 కి వేలంపాటలో అత్యధిక ధరకు దక్కించుకున్నారు. అనంతరం ఒక రాజు అనే వ్యక్తికి 18వేలకు పులస చేపను విక్రయించినట్లు తెలిపారు. యానాంలో పులస చేపల సీజన్ సాధారణంగా జులై, ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఉంటుంది. గోదావరి నదికి వరదలు వచ్చి, ఎర్ర నీరు పోటెత్తిన సమయంలో ఈ చేపలు సముద్రం నుండి గోదావరిలోకి ఎదురీదుకుంటూ వస్తాయి. "పుస్తెలు అమ్మినా సరే పులస తినాలి" అనే సామెత గోదావరి జిల్లాల్లో ఈ చేపకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దీని అరుదైన లభ్యత మరియు ప్రత్యేకమైన రుచి కారణంగా పులసకు చాలా డిమాండ్ ఉంటుంది.

Tags:    

Similar News