AP: పులివెందుల ఉప ఎన్నికపై కుంభమేళాలో చర్చ
రఘురామకృష్ణం రాజు-బీటెక్ రవి మధ్య ఆసక్తికర చర్చ;
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల ఉప ఎన్నికపై ఆసక్తికర చర్చ జరిగింది. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పవిత్ర స్నానం చేస్తున్న సమయంలో... అక్కడే ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పులివెందులకు ఉప ఎన్నిక రావాలని బాగా మొక్కుకో అంటూ సూచించారు. ఉప ఎన్నికలు వస్తే మీరే పులివెందుల ఇన్చార్జిగా రావాలని రామకృష్ణం రాజుకు బిటెక్ రవి కోరారు.
కాసేపట్లో వంశీతో జగన్ ములాఖత్
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ ములాఖత్ కానున్నారు. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని జగన్ పరామర్శిస్తారు. తాడేపల్లి నుంచి బయల్దేరి 11 గంటలకు జైలులో వంశీతో ములాఖత్ అవుతారు. పార్టీ శ్రేణులు కూడా సబ్ జైలు వరకూ జగన్ వెంట వెళ్లనున్నాయి. వంశీకి ధైర్యం చెప్పిన తర్వాత... జైలు బయట జగన్ దీనిపై మాట్లాడే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు తెలిపాయి.
జగన్ ఇంకా మారలేదా..?
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి కూడా శాసనసభకు హాజరవ్వకూడదని జగన్ తీసుకున్న నిర్ణయంపై విమర్శల వర్షం కురుస్తోంది. జగన్ చెప్పిన కారణాలపైనా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో ప్రజల తరపున గళం వినిపించాల్సిన జగన్.. చిన్నచిన్న కారణాలకే శాసనసభకు రాకపోవడం సహేతుకం కాదని రాజకీయ నిపుణులు అంటున్నారు.