ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు
ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనింగ్‌లో వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.;
ఏపీ సీఎం జగన్‌పై మరింత ఘాటు విమర్శలు గుప్పించారు వైసీపీ రెబర్ ఎంపీ రఘురామకృష్ణరాజు. తనను చంపించాలని చూస్తే జగన్‌కే నష్టమని ఆయన ఆరోపించారు. జగన్‌కు మంచి భవిష్యత్తు ఉందని.. తనతో పెట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు రఘురామకృష్ణరాజు. సీబీఐ కేసులో నిందితుడిగా ఉన్న జగన్‌కు బెయిల్ త్వరలో రద్దు అవుతుందన్న ఆయన.. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకు ప్రారంభోత్సవాలు పెట్టుకుంటున్నారని చెప్పారు.
ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనింగ్‌లో వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆక్వా రైతులను వేధించొద్దన్న రఘురామకృష్ణరాజు.. రాష్ట్రంలో చిన్నకారు రైతుల జోలికి వెళ్తే జగన్ ప్రభుత్వానికి నష్టమని స్పష్టంచేశారు.