మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు రఘురామ తెలిపారు. భక్తులెవరికీ అసౌకర్యం కలవకుండా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.