అల్పపీడనం ప్రభావంతో తిరుపతిలో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో నాలుగు రోజులు పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.