Ram Mohan Naidu: సీఎం తీసుకున్న నిర్ణయంపై అనుమానం: ఎంపీ రామ్మోహన్ నాయుడు
Ram Mohan Naidu: అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పేవరకు పోరాటం ఆగదని అన్నారు.;
మూడు రాజధానుల బిల్లు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అనుమానం వ్యక్తం చేశారు. సీఎం నిర్ణయం వెనక ఏదైనా కుట్ర దాగి ఉందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు.
అమరావతిలోనే రాజధాని ఉంటుందని స్వయంగా జగన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పేవరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని అన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు.