Tirupati Floods: రాయల చెరువుకు మరమ్మతులు మొదలు..
Tirupati Floods: తిరుపతి రాయలచెరువు లీకేజ్‌కు.. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు అధికారులు.;
rayala cheruvu (tv5news.in)
Tirupati Floods: తిరుపతి రాయలచెరువు లీకేజ్‌కు.. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు అధికారులు. భారీ వర్షాలు, వరదలతో రెండ్రోజుల క్రితం రాయలచెరువు కట్ట మట్టి కుంగిపోయి లీకేజీ పడింది. చెరువునుంచి నీరు లీక్ కావడంతో ప్రజల ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా..18 గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించారు అధికారులు.
యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఇసుక సిమెంట్, కంకర కలిపిన మిశ్రమాన్ని 30వేల గోతాల్లో నింపుతున్నారు. జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్ల సాయంతో.. వందల సంఖ్యలో కూలీలు.. మరమ్మతు పనులు చేస్తున్నారు. అటు స్థానిక నేతలు సైతం..అధికారులకు తోడ్పాటునందిస్తున్నారు. లీకవుతున్న ప్రాంతం వద్ద చదును చేసి బస్తాలతో నింపుతున్నారు. బాదురు వద్ద గండిని వెడల్పు చేసి అవుట్ ఫ్లో పెంచారు. చెరువు నీటి మట్టం కూడా మూడు అడుగుల మేర తగ్గింది. రెండ్రోజుల్లో పనులు పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు అధికారులు. మరోవైపు.. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు.