ఏపీలో మద్యం ప్రియులకు ఉపశమనం
ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జీవో 411 ప్రకారం..;
ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జీవో 411 ప్రకారం మద్యం బాటిళ్లు తీసుకువచ్చే అవకాశం ఉన్నా.. ఏపీ పోలీసులు, SEB అధికారులు అరెస్ట్ చేస్తున్నారన్న వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. జీవో 411 ప్రకారం 3 మద్యం బాటిళ్లను తెచ్చుకోవచ్చని తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో మద్యం ప్రియులకు ఉపశమనం కల్గినట్లయ్యింది.