AP: లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ పొడిగింపు

Update: 2025-10-13 11:03 GMT

లిక్కర్ స్కాం కేసులో నిందితులకు ఈ నెల 16వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఈ నెల 20న న్యూయార్క్ వెళ్లేందుకు పిటీషన్ వేశారు. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులను ఆదేశించింది. మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెన్ను నొప్పికి చికిత్స తీసుకునేందుకు అనుమతి కోరగా తదుపరి విచారణలో పరిశీలిస్తామని తెలిపింది.

 కీలక మలుపు 

ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఈ నెల 20వ తేదీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనపై స్పందించిన కోర్టు, సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి కోర్టులో తన ఆరోగ్య పరిస్థితిపై పలు విన్నపాలు చేశారు. తాను తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నానని తెలిపారు. నిన్న, మొన్న ఆసుపత్రిలో చూపించుకున్నానని కోర్టుకు వివరించారు. వైద్యులు ఫిజియోథెరపీ చేయించాలని సూచించారని చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన మంతెన ఆశ్రమంలో చికిత్స చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, తాను పోలీస్ కస్టడీలోనే చికిత్స చేయించుకుంటానని కోర్టుకు స్పష్టం చేశారు. నొప్పి భరించలేకపోతున్నానని కోర్టులో పేర్కొన్నారు. ఈ అభ్యర్థనపై కోర్టు స్పందిస్తూ తదుపరి విచారణలో పరిశీలిస్తామని తెలిపింది.

Tags:    

Similar News