ఏపీలో ఎస్సీ వర్గీకరణపై నివేదిక సిద్ధమైంది. నివేదికను సీఎస్ కె.విజయానందక్ కు ఏకసభ్య కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా ఇవాళ అందజేశారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఉప వర్గాల్లో ఆర్థిక స్వావలంబన, తదితర అంశాలపై కమిషన్ అధ్యయనం చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం దానిని అమలు చేసేందుకు ముందుగా ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది.