భీమవరంలో రేవంత్‌రెడ్డి ప్లెక్సీలు.. హవా మాములుగా లేదుగా..!
Revanth Reddy : పశ్చిమగోదావరి జిల్లాలోనూ రేవంత్ రెడ్డి ప్లెక్సీలు దర్శమనిస్తున్నాయి.;
Revanth Reddy : పశ్చిమగోదావరి జిల్లాలోనూ రేవంత్ రెడ్డి ప్లెక్సీలు దర్శమనిస్తున్నాయి. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపడుతున్న వేళ.. భీమవరంలో పలుచోట్ల శుభాకాంక్షలు తెలుపుతూ రేవంత్ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రేవంత్‌రెడ్డికి అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. గతంలో రేవంత్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.