Road Accident : నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న బస్సు.. స్పాట్ లోనే
ఏపీ లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం తో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీ నీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో ఒకరు మృతి చెందారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలో జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం... బెంగుళూరు నుండి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విజయవాడ బయలుదేరింది. నెల్లూరు జిల్లా కొవ్వూరు పరిధిలో కి రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది బస్సు. దీంతో బస్సు లో ముందు ఉన్న నాని అనే వ్యక్తి కేబిన్ లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ముందు నుండి డీ కొట్టడం తో ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.