AP : రోజా రాజకీయం.. పెద్దిరెడ్డికి భారీ షాక్

Update: 2024-09-14 00:30 GMT

ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ట్విస్ట్. వైసీపీలో కోల్డ్ గ్రూప్ వార్ మరోసారి బయటపడింది. మాజీ మంత్రి రోజా ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లా ఇంచార్జ్ ఎమ్మెల్సీ భరత్… మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులపై సస్పెన్షన్ వేటు వేశారు. నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే శాంతి, కేజే కుమార్ ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ భరత్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పెద్దిరెడ్డి వర్సెస్ రోజా అన్నట్లు సీన్ చేంజ్ అయిపోయింది.

ఉమ్మడి చిత్తూరు జిల్లా ముఖ్యనేతలు … జగన్ కలసి పెద్దిరెడ్డి అనుచరుల ఆగడాలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సొంత పార్టీ ఓటమికి వారే కారణమంటూ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ కోల్డ్‌ వారు జరుగుతోందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. దీనిపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News