AP : రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐపిఎస్ ల పాత్ర: నాదెండ్ల

Update: 2024-07-11 10:28 GMT

రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు IPS అధికారుల పాత్ర ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడలో రాయితీపై కందిపప్పు, బియ్యం అందించే రైతుబజార్ తొలి కౌంటర్‌ను ఆయన ప్రారంభించారు. ‘కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశాం. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. నిత్యావసర సరకులను రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు రైతు బజార్లలో రాయితీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీ ప్రారంభించింది. విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్లో తొలి కౌంటర్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, పౌరసరఫరాలశాఖ, కృష్ణా జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఆదేశాలతో సామాన్యులకు నిత్యావసర సరకులను రాయితీపై అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు

Full View

Tags:    

Similar News