West Godavari: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. వాగులో పడిన ఆర్‌టీసీ బస్సు.. 47 మంది ప్రయాణికుల్లో..
West Godavari: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.;
West Godavari: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి సమీపంలో అదుపుతప్పిన ఓ ఆర్టీసీ బస్సు జల్లేరు వాగులో పడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది.
అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జల్లేరు వాగులో పడిపోయింది. బస్సు కిటికీల్లోంచి దూకి పలువురు ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు.