మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీబీఐ స్పెషల్ కోర్టు విచారణకు హాజరయ్యారు. సాధారణ కోర్టు హాజరు అయినా, కోర్టు వద్ద కనిపించిన వాతావరణం మాత్రం పూర్తిగా రాజకీయ రంగును సంతరించుకుంది. జగన్ వస్తున్నారు అన్న సమాచారంతో ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దఎత్తున వైసీపీ బ్యాచ్, పెయిడ్ బ్యాచ్ హైదరాబాద్‌కు చేరుకోవడం చర్చనీయాంశమైంది. జగన్ ఏదైనా ప్రజా పోరాటానికి వచ్చారా అసలు. దేశ సేవకు సంబంధించిన ఏదైనా ప్రత్యేక కేసులో విచారణ జరుగుతోందా అనే ప్రశ్నలు ఈ బ్యాచ్ ను చూసిన వారికి వస్తున్నాయి. కానీ విచారణ జరుగుతున్నది అక్రమ ఆస్తుల కేసుల్లోనే కదా. ఇలాంటి కేసులో కోర్టుకు హాజరవుతున్న నాయకుడికి ఫిల్మీ స్టైల్ బిల్డప్ ఇచ్చి, భారీ కాన్వాయ్‌లు, పెయిడ్ బ్యాచ్ తరలించడం ఎందుకు.
వైసీపీ నుంచి వచ్చిన పెద్ద బృందం సహజంగానే అనేక ప్రశ్నలకు తావిచ్చింది. ఇదంతా నిజమైన మద్దతేనా.. లేదా ఏర్పాటు చేసుకున్న ‘పెయిడ్ బ్యాచ్’నా అని
సందేహాలు వస్తున్నాయి ఇది చూసిన వారికి. కోర్టు హాజరుని పవర్ షోగా మార్చే రేంజ్ లో బిల్డప్ అవసరమా అని విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ కోర్టుకు హాజరైన సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం దారుణంగా మారింది. “రేవంత్ భయపడ్డాడు… రేవంత్ టెన్షన్‌లో ఉన్నాడు” లాంటి పోస్టర్లు వైసీపీ సోషల్ మీడియాలో కనిపించాయి.
జగన్ అక్రమ ఆస్తుల కేసులో కోర్టుకు వస్తుంటే, రేవంత్ రెడ్డి ఎందుకు భయపడతాడు. ఆయన తలచుకుంటే ఈ వైసీపీ బ్యాచ్ అంతా లోపలికి వెళ్లేది కదా. ఎక్కడకు వెళ్లినా సరే ఇలాంటి ప్రచారం అవసరమా అని అంటున్నారు. వైసీపీ ప్రచారం, బిల్డప్, సోషల్ మీడియా నరేటివ్ చూసిన వారంతా ఉద్దేశపూర్వకంగా రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేయాలని వైసీపీ చూస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ హడావిడిలో కేసు అసలైన విషయాలు కనుమరుగై పోవాలనే ప్రయత్నం కూడా అయి ఉండొచ్చు అంటున్నారు.