RUSHIKONDA: రుషికొండ ప్యాలెస్‌పై దిగ్గజ సంస్థల కన్ను

ప్యాలెస్ ను లీజుకు తీసుకునేందుకు దిగ్గజ కంపెనీల ప్రయత్నం

Update: 2025-12-25 07:45 GMT

వి­శా­ఖ­ప­ట్నం­లో­ని రు­షి­కొండ ప్యా­లె­స్ వి­ని­యో­గం­పై ది­గ్గజ సం­స్థ­లు ఆస­క్తి కన­బ­రు­స్తు­న్నా­యి. ప్యా­లె­స్ ను లీ­జు­కు తీ­సు­కో­వ­డా­ని­కి ముం­దు­కొ­స్తూ ప్ర­భు­త్వా­ని­కి ప్ర­తి­పా­ద­న­లు ఇస్తు­న్నా­యి. ఈ వి­ష­యా­న్ని రా­ష్ట్ర మం­త్రు­లు వి­లే­క­రుల సమా­వే­శం­లో వె­ల్ల­డిం­చా­రు. వి­వ­రా­ల్లో­కి వె­ళ్తే వి­శాఖ రు­షి­కొండ ప్యా­లె­స్ వి­ని­యో­గం­పై కే­బి­నె­ట్ సబ్ కమి­టీ నేడు భేటీ అయ్యిం­ది. సబ్ సంఘం భే­టీ­లో మం­త్రు­లు పయ్యా­వుల కే­శ­వ్, కం­దుల దు­ర్గే­శ్ పా­ల్గొ­న్నా­రు. మం­త్రి డీ­ఎ­స్బీ­వీ స్వా­మి, అధి­కా­రు­లు వర్చు­వ­ల్ గా భే­టీ­కి హా­జ­ర­య్యా­రు. టాటా, లీలా గ్రూ­ప్ వంటి పలు ప్ర­ముఖ ది­గ్గ సం­స్థ­లు ప్యా­లె­స్ వి­ని­యో­గా­ని­కి ముం­దు­కొ­చ్చిన అం­శం­పై సమా­వే­శం­లో చర్చిం­చా­రు. టూ­రి­జం సహా పలు­ర­కాల వి­ని­యో­గా­ని­కి సదరు సం­స్థ­లు డీ­పీ­ఆ­ర్ ఇచ్చి­న­ట్లు మం­త్రు­లు పే­ర్కొ­న్నా­రు. సం­స్థ­లు ఇచ్చిన డీ­పీ­ఆ­ర్ లపై కే­బి­నే­ట్ సబ్ కమి­టీ లో­తైన వి­శ్లే­షణ చే­సిం­ది. ప్ర­జల నుం­చి సే­క­రిం­చిన అభి­ప్రా­యా­ల­పై కూడా చర్చిం­చిం­ది. మరో­సా­రి ఎల్లుం­డి సమా­వే­శం కా­వా­ల­ని తీ­ర్మా­నిం­చిం­ది. రుషి కొండ ప్యా­లె­స్ ను అం­ద­మైన హో­ట­ల్ గా మా­ర్చ­గ­లి­గి­తే మొ­త్తం ఉప­యో­గం­లో­కి వస్తుం­ద­ని రా­ష్ట్ర పర్యా­టక శాఖ మం­త్రి కం­దుల దు­ర్గే­శ్ అన్నా­రు.

రుషి కొండపై ఉన్న ఈ కట్టడాలను హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి అప్పగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు దేశీయ, అంతర్జాతీయ హోటల్ గ్రూపుల నుంచి ఆసక్తి వ్యక్తమవుతున్నట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ వెల్లడించారు. తాజ్‌ గ్రూప్‌, లీలా హోటల్‌గ్రూప్‌అట్మాస్పియర్‌ కోర్ వంటి ప్రముఖ సంస్థలు ఈ ప్యాలస్‌ను లగ్జరీ హోటళ్లుగా మార్చేందుకు ముందుకు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనల్లో ఒక చిన్న మెలిక ఉంది. కొన్ని సంస్థలు హోటల్ నిర్వహణకు అదనపు స్థలం కావాలని కోరుతుండటం ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. రుషికొండ ప్యాలస్ పూర్తిగా ప్రైవేటు సంస్థలకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రుషి కొండలోని చివరి రెండు బ్లాక్‌లను ప్రజల కోసం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం, పర్యాటకుల అవసరాల కోసం ప్రత్యేకించనున్నట్టు మంత్రి పయ్యావుల తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న భవనాలపై అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మించే సాంకేతిక అవకాశం ఉందని దీనిపై చర్చిస్తున్నామని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News