తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
కోవిడ్ నేపథ్యంలో తెప్పోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తోంది టీటీడీ.;
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఇవాళ్టి నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే కోవిడ్ నేపథ్యంలో తెప్పోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తోంది టీటీడీ. శ్రీవారి పుష్కరిణిలో 5 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భక్తుల అనుమతిని పూర్తిగా రద్దు చేశారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణావతారంలో మాఢవిధుల్లో శ్రీవారు ఊరేగనున్నారు. ఇక తెప్పోత్సవం సందర్భంగా ఇవాళ, రేపు సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.