ఏపీలోని అన్నమయ్య జిల్లాలో స్కూల్ పిల్లలకు పెను ప్రమాదం తప్పింది. రాయచోటి మండలం అనుంపల్లి వద్ద ఓ స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వర్షపు నీరు ఉండడంతో శ్రీ చైతన్య స్కూల్ బస్సు ఒక పక్కకు ఒరిగింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రమాదం జరగకుండా చూశాడు.ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 52 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.