విద్యార్ధిపై చేయి చేసుకున్న ఏనుగుతుని హెడ్ మాస్టర్ సస్పెన్షన్
విద్యార్ధిపై చేయి చేసుకున్న ఏనుగుతుని హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేశారు. విశాఖ జిల్లా కశింకోట మండలం ఏనుగుతుని స్కూల్ విద్యార్ధిపై హెడ్‌మాస్టర్ శర్మ చేయిచేసుకున్నారు.;
విద్యార్ధిపై చేయి చేసుకున్న ఏనుగుతుని హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేశారు. విశాఖ జిల్లా కశింకోట మండలం ఏనుగుతుని స్కూల్ విద్యార్ధిపై హెడ్‌మాస్టర్ శర్మ చేయిచేసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వరరెడ్డి ఆదేశాలతో మండల విద్యాశాఖ అధికారి దివాకర్.. స్కూలుకు వెళ్లి విచారించారు. విద్యార్ధి, విద్యార్ధి తల్లిదండ్రులు, హెడ్ మాస్టర్, చుట్టుపక్కల వారి నుంచి వివరాలు సేకరించారు. విచారణ జరిపిన ఎంఈఓ దివాకర్... హెడ్‌మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. అమ్మ ఒడి డబ్బులు రాకపోవడంతో విద్యార్ధి రూపేశ్ హెచ్‌ఎంను వివరాలు అడిగే ప్రయత్నం చేశాడు. దీనిపై ఆగ్రహించిన హెచ్‌ఎం శర్మ.. విద్యార్ధిపై చేయిచేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో అధికారులు విచారణ జరిపారు.