పిల్లలూ బడికెళ్లాలి బ్యాగు సర్ధండి.. ఆగస్ట్ 16 నుంచి..

ఎట్టకేలకు బడి గంట మోగనుంది. కరోనా భయంతో మూతపడ్డ కళాశాలలు, పాఠశాలలు పిల్లలతో సందడి చేయడానికి సంసిద్ధమవుతున్నాయి.

Update: 2021-07-29 10:32 GMT

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు బడి బాట పట్టే సమయం ఆసన్నమైంది. ఎట్టకేలకు బడి గంట మోగనుంది. కరోనా భయంతో మూతపడ్డ కళాశాలలు, పాఠశాలలు పిల్లలతో సందడి చేయడానికి సమాయత్తమవుతున్నాయి. ఆగస్ట్ 16 నుంచి పాఠశాలలు పున:ప్రారంభిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

ఈలోగా ఉపాధ్యాయులందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని మంత్రి తెలిపారు. రెండో విడత విద్యా కానుక అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. నాడు-నేడు పనులు 90-98 శాతం పూర్తయ్యాయని, ఆగస్ట్ 16న నాడు-నేడు ఫేజ్-2తో.. బడి రూపు రేఖలు మార్చేలా కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు.

అమ్మ ఒడి, వసతి దీవెన వద్దనుకుంటున్న వారికి వచ్చే ఏడాది నుంచి ల్యాప్‌టాప్‌లు అందిస్తామని మంత్రి సురేష్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News