AP : చిన్నారి మిస్సింగ్ కేసులో సంచలనం.. తండ్రే నిందితుడని గుర్తించిన పోలీసులు...

Update: 2025-08-08 16:30 GMT

గత రెండు రోజులు క్రితం విజయవాడ రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్ వద్ద మూడేళ్ల చిన్నారి శ్రావణి అదృశ్యమైన సంగతి తెలిసిందే. తండ్రి తో కలిసి వచ్చిన కూతురు కాసేపటి తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో తమ కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారని చిన్నారి తండ్రి రైల్వే పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. చిన్నారి తండ్రే డబ్బు కోసం పాపను వేరే వాళ్ళకు అమ్మడానికి ప్రయత్నించునట్టుగా పోలీసులు గుర్తించారు.

కాగా రైల్వే స్టేషన్‌లో మిస్సయిన శ్రావణి ఆచూకీ లభించింది. బొల్లా శ్రీనివాస్, చిన్నారి అనే మహిళ శ్రావణి నీ తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా శ్రావణి తండ్రి మస్తాన్ కు రూ.5 వేలు ఇవ్వడంతో అతను స్టేషన్ నుంచి బయటకు వెళ్లాడని...తర్వాత శ్రావణి ను తీసుకెళ్లినట్లుగా పోలీసులు సీసీ కెమెరాల సాయంతో గుర్తించారు. రాజమండ్రిలో ఉన్న సీతంపేటకు శ్రావణిని తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే శ్రావణి ని అమ్మేందుకు తీసుకువెళ్తున్నారా లేక బెగ్గింగ్ చేయించడానికా అనే అంశం పై పోలీసులు విచారణ చేపట్టారు. శ్రావణి తల్లి తండ్రులు విడివిడిగా ఉంటున్నట్టు గుర్తించారు. ఈ కేసులో శ్రావణి తల్లిని కూడా విచారించనున్నారు పోలీసులు.

Tags:    

Similar News